Sakshi News home page

Published Fri, May 25 2018 4:13 PM

Ravi Shastri  Says Virat Kohli Not A Machine  - Sakshi

ముంబై : టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి యంత్రం కాదని, అతను కూడా మనిషేనని కోచ్‌ రవిశాస్త్రి ఘాటుగా వ్యాఖ్యానించాడు. మెడ గాయం కారణంగా కోహ్లి కౌంటీ క్రికెట్‌కు దూరమైన విషయం తెలిసిందే. దీంతో కౌంటీ క్రికెట్‌ ఆడేందుకు కోహ్లితో ఒప్పందం చేసుకున్న సర్రే క్రికెట్‌ క్లబ్‌ తీవ్ర నిరాశ వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా రవిశాస్త్రి ఓ చానెల్‌తో మాట్లాడుతూ... ‘కోహ్లి ఏమీ యంత్రం కాదు. అతడు కూడా మనిషే. అతనేమి టాప్‌ డాగ్‌(ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాళ్లను ఇలా పిలుస్తారు) కాదు. కోహ్లికి రాకెట్‌ కట్టి ఆడించలేం కదా. అతనికి విశ్రాంతి అవసరమే. టాప్‌ డాగ్‌లకు సైతం రాకెట్‌ కట్టి ఆడించలేం’ అని శాస్త్రి అభిప్రాయపడ్డాడు. 

ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ)కి సారథ్యం వహించిన కోహ్లి సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ చేస్తుండగా మెడకు గాయమైంది. వైద్య పరీక్షల అనంతరం విశ్రాంతి తీసుకోవాలని బీసీసీఐ వైద్యులు సూచించారు. దీంతో ఇంగ్లండ్‌ పర్యటనకు ముందు సన్నాహకంగా కౌంటీ క్రికెట్‌ ఆడాలనుకున్న కోహ్లికి నిరాశే ఎదురైంది. జూన్‌ 15న ఫిట్‌నెస్‌ టెస్టు నిర్వహించి ఇంగ్లండ్‌ పర్యటనకు అతను అందుబాటులో ఉంటాడా లేదో తేల్చనున్నారు. 

adsolute_video_ad

Advertisement

What’s your opinion

Advertisement